Home సినిమా వార్తలు నితిన్ ‘తమ్ముడు’ బడ్జెట్ డీటెయిల్స్

నితిన్ ‘తమ్ముడు’ బడ్జెట్ డీటెయిల్స్

thammudu

యువ నటుడు నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న తాజా సినిమా తమ్ముడు. ఈ సినిమాని వకీల్ సాబ్ మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా లయ ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

కాంతారా మూవీ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూలై 4న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ తో మంచి ఇంట్రెస్ట్ ఏర్పరచిన ఈ సినిమా సాంగ్స్ ఒకటొకటిగా రిలీజ్ చేస్తుంది టీమ్.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా తమ్ముడు మూవీ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఆడియన్స్ కి కచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తుందని అలానే ఎంగేజింగ్ గా సాగే ఈ సినిమాకి ఓవరాల్ గా రూ. 75 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

మరోవైపు బిజినెస్ పరంగా కూడా బాగానే సేల్స్ జరిగిన ఈ సినిమా రిలీజ్ అనంతరం ఖచ్చితంగా పెద్ద విజయం అందుకుంటుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేసారు. మరి ఇటీవల వరుసగా ప్లాపులతో సతమతం అవుతున్న నితిన్, తమ్ముడు మూవీతో ఏ స్థాయిలో విజయం అందుకుంటారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version