యువ నటుడు నితిన్ హీరోగా తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మార్చి 28న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్దమవుతోంది. మరోవైపు మూవీ యొక్క ప్రమోషన్స్ ని విరివిగా నిర్వహిస్తోంది మూవీ టీమ్.
ఇక ఈ మూవీ యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 30 కోట్లకు అమ్ముడయ్యాయి. కోస్తా ఆంధ్ర బిజినెస్ రూ. 12 కోట్లు కాగా సీడెడ్ రూ. 3.6 కోట్లు జరిగింది. ఒకరకంగా ఇది మంచి బిజినెస్ అని చెప్పాలి. గతంలో నితిన్ తో వెంకీ తీసిన భీష్మ మంచి విజయం అందుకుని దాదాపుగా రూ. 30 కోట్ల వరకు రాబట్టింది.
ఇక దీని బ్రేకివేన్ ని మూవీ యొక్క కంటెంట్ బాగుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈజీగా దాటేయవచ్చు. అయితే తన కెరీర్ పరంగా ఈమూవీతో పెద్ద విజయం సొంతం చేసుకుని రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకోవాలనేది నితిన్ టార్గెట్ అట. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన రాబిన్ హుడ్ రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.