టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ హీరోగా ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబిన్ హుడ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, గ్లింప్స్ అలానే ఒక సాంగ్ అందరిని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
ఇప్పటికే వెంకీ, నితిన్ ల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ మంచి సక్సెస్ సొంతం చేసుకోవడంతో రాబిన్ హుడ్ పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి రానున్న క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని కారణాల రీత్యా ఈ మూవీని జనవరి 13న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారట. దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందని అంటున్నారు. మొత్తంగా అయితే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన రాబిన్ హుడ్ రిలీజ్ అనంతరం ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.