జయం సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయి ఫస్ట్ మూవీతోనే మంచి విజయం క్రేజ్ అందుకున్న నటుడు నితిన్. ఆ తరువాత దిల్ రాజు తీసిన దిల్ మూవీతో మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు నితిన్. అక్కడి నుండి కెరీర్ పరంగా వరుసగా అవకాశాలతో కొనసాగిన నితిన్, మధ్యలో పలు ఫ్లాప్ లు కూడా చవి చూసారు.
ఇక తాజాగా యువ అందాల నటి శ్రీలీలతో కలిసి ఆయన చేస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వెంకీ కుడుముల తీసిన ఈ మూవీ మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ గురించి నితిన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
ఇష్క్ ముందు ఫ్లాప్ లు ఉన్నాయి. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ సినిమాల సక్సెస్ లతో ట్రాక్లోకి వచ్చాను. ఆ తరువాత కొన్ని ఫెయిల్యూర్స్ తో మళ్ళి ఆఫ్ ట్రాక్ అయ్యాను. దానితో స్క్రిప్ట్ ల ఎంపిక పై మరింత జాగ్రత్తగా దృష్టి పెట్టాను.
ఇప్పుడు చేస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు, ఎల్లమ్మ & విక్రమ్ కుమార్ ల సినిమాలతో మళ్ళి ఖచ్చితంగా మంచి ట్రాక్ లో వస్తానని నా ఫీలింగ్ అని అన్నారు. మరోవైపు రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ విషయంలో తగ్గకుండా జోరు కొనసాగిస్తోంది టీమ్. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.