Homeసినిమా వార్తలుమళ్ళీ వాయిదా పడిన కార్తీకేయ -2

మళ్ళీ వాయిదా పడిన కార్తీకేయ -2

- Advertisement -

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తీకేయ 2 ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. జూలై 22న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆ తరువాత ఆగస్ట్ 5న వస్తుంది అని అన్నారు కానీ మళ్ళీ ఆగస్ట్ 12కు విడుదల తేదీని మార్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి చిత్రం విడుదల తేదీ మార్చినట్లు తెలుస్తోంది.

దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా, కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏ గా నటిస్తున్నారు. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే శ్రీనివాసరెడ్డి కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

అయితే ముందుగా చెప్పుకున్నట్లు ఈ సినిమా జులై 22న విడుదల చేయాలని భావించినా.. థాంక్యూ చిత్రం కోసం వాయిదా వేశారు. అయితే ఆ తరువాత ఆగష్టు 5న విడుదల చేయాలి అనుకుంటే అప్పటికే ఆ డేట్ కు బింబిసార.. సీతారామం సినిమాలు ఉండడంతో, ఆగస్ట్ 15 డేట్ కలిసి వస్తుందని ఆ డేట్ కు ఇతర సినిమాలు ఉన్నా కూడా పెద్దగా నష్టం ఉండదని భావించి ఆగస్ట్ 12న కార్తీకేయ 2 ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే ఆగస్ట్ 12న నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

READ  ఆగస్టుకు పోస్ట్ పోన్ అవనున్న కార్తికేయ 2?

ముందుగానే మేం డేట్ ఇచ్చాక, మళ్ళీ అదే డేట్ కు ఎలా వస్తారని మాచర్ల టీమ్ అలక బూనారట. ఇక వారి నుంచి ఇబ్బంది ఎందుకని కార్తీకేయ 2 ఒక్క రోజు ఆగి అంటే ఆగస్ట్ 13న తమ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ వ్యవహారం మొత్తం ఒక సినిమా ట్విస్టుల మాదిరి థ్రిల్లర్ లా సాగింది.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‏కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతే కాకుండా మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో తాజాగా కార్తికేయ 2 సినిమా ప్రచార కార్యక్రమాలకు హీరో నిఖిల్ మరియు చిత్ర యూనిట్ చక్కని విభిన్నమైన పద్ధతిలో చేశారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇలా విభిన్న నగరాల్లో కాంటెస్ట్ లు నిర్వహించి సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు. మరి ఎట్టకేలకు అన్నీ ఇబ్బందులు ఎదురుకుని విడుదల అవుతున్న ఈ సినిమా, నిఖిల్ మరియు చిత్ర యూనిట్ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  కష్టాల్లో థియేటర్లు: ఆంధ్ర ప్రదేశ్ లో 400 థియేటర్ల మూసివేత


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories