18 పేజెస్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ బిజినెస్ చేసింది. కాగా జనవరి 27 తారీఖు నుంచి ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫారంలలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మొదటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా కాగా, రెండోది నెట్ ఫ్లిక్స్.
ఈ మేరకు ఈ సినిమా స్ట్రీమింగ్ పై రెండు ప్లాట్ ఫామ్ లు కూడా 18 పేజేస్ సినిమా స్ట్రీమింగ్ సమాచారాన్ని అధికారికంగా ప్రకటనలు విడుదల చేశాయి.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథ అందించారు. నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటించగా.. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన చిత్రం ’18 పేజెస్’. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, అందమైన పాటలతో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్, నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించారు.
సిద్ధు (నిఖిల్ సిద్ధార్థ్) అనే యాప్ డెవలపర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె అతన్ని మోసం చేస్తుంది. ఈ కారణంగా సిద్ధు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక అలాంటి సమయంలో, అతనికి నందిని (అనుపమ పరమేశ్వరన్) డైరీ రోడ్డుపై దొరుకుతుంది.
ఆ డైరీని చదవడం మొదలు పెట్టిన సిద్ధు నెమ్మదిగా నందినితో ప్రేమలో పడతాడు. నందిని గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్న సిద్ధు ఆమెను వెతికే ప్రయత్నంలో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఎంటి ? అతను ఆమెను చూశాడా? నందిని పట్ల సిద్ధు తన భావాలను వ్యక్తపరిచాడా? ఇదే ఈ సినిమా ప్రధానాంశం.
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at [email protected]. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.