Homeసినిమా వార్తలుఆగస్టుకు పోస్ట్ పోన్ అవనున్న కార్తికేయ 2?

ఆగస్టుకు పోస్ట్ పోన్ అవనున్న కార్తికేయ 2?

- Advertisement -

అర్జున్ సురవరం సినిమా తరువాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్న యంగ్‌ హీరో నిఖిల్ ఈ ఏడాది ఆసక్తికరమైన సినిమాతో వస్తున్నాడు. ఇదే కాక ఆ పై నిఖిల్‌ వరుస సినిమాలను సిద్ధం చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి అందులో ‘కార్తికేయ-2’ ఒక‌టి. చందు ముండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కింది. 2014లో వ‌చ్చిన‌ ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిచన ఆ చిత్రం ఊహించని క‌లెక్ష‌న్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 రాబోతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌/ట్రైలర్ లకుప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌,ప్రోమోలకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నట్లు కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించిన ఓ కొత్త వార్త తెర పైకి వచ్చింది.జూలై 22న విడుదలకు సిద్ధమైన కార్తికేయ 2 ఇప్పుడు ఆ తేదీన రాకపోవచ్చని తెలుస్తుంది.కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు ఒకటికి రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా జూలై 8 నుండి 22 కు విడుదలను వాయిదా వేసింది.

READ  Sai Pallavi: సాయి పల్లవి పై కేసు నమోదు

అందువల్ల ఓకే రోజు రెండు సమానమైన హీరోల సినిమాలు విడుదలైతే ఇబ్బందులు ఎదురవుతాయని కార్తికేయ 2 సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు జూలై 22 కాకుండా ఆగస్టు రెండో వారంలో కార్తికేయ 2 విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఖరారు అవకపోయినా ఈ వార్తదాదాపుగా నిజమేనని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అంటున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 18 కొట్లకు పైగానే ఢీల్ కుదిరినట్లు సమాచారం. ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ఢీల్‌ కుదరమంటే సాధారణ విషయం కాదు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైర‌వ సంగీతం అందించిన‌ ఈ చిత్రం వచ్చే నెల తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

READ  విజిల్ వేయిస్తున్న "ది వారియర్" కొత్త పాట

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories