నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే నిహారిక ఉన్న ఇన్ స్టాగ్రామ్ పోస్టులను చైతన్య తన అకౌంట్ నుంచి డిలీట్ చేయగా, ఇప్పుడు నిహారిక కూడా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసారు. అంతే కాదు సోషల్ మీడియా వేదిక పై వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో (unfollow) కూడా అయ్యారు.
వీరిద్దరి వైవాహిక బంధంలో సమస్య వచ్చిందని, పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకునే దశలో ఉన్నారని నిరంతర వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
నిహారిక, చైతన్య కొన్ని రోజులుగా ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారని, కొన్ని నెలలుగా వారు విడివిడిగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తొలగించి వార్తల్లో నిలవగా, చైతన్య గతంలో నిహారిక ఫోటోలు, వీడియోలను డిలీట్ చేశారు.
వారి వైవాహిక సమస్యలకు ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ వారు విడాకులు తీసుకోవడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. చట్టపరమైన చర్యలు కూడా పురోగతిలో ఉన్నట్లు వినికిడి. అయితే నిహారిక, చైతన్య తమ విడాకులు లేదా విడిపోవడానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు.
హీరో వరుణ్ తేజ్ సోదరి, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైన నాగబాబు కుమార్తెగా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. “సూర్యకాంతం”, “ఒక మనసు”, “హ్యాపీ వెడ్డింగ్” వంటి చిత్రాలలో ఆమె నటించారు. ఇక చైతన్య జొన్నలగడ్డ టెక్ ప్రొఫెషనల్, గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం.ప్రభాకరరావు గారి కుమారుడు.