Home సినిమా వార్తలు Niharika Comments on Allu Arjun అల్లు అర్జున్ నంద్యాల ఘటన పై నిహారిక సెన్సేషనల్...

Niharika Comments on Allu Arjun అల్లు అర్జున్ నంద్యాల ఘటన పై నిహారిక సెన్సేషనల్ కామెంట్స్

Niharika and allu arjun

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి సినిమా నుండి నటుడిలాగా మంచి పేరుతో పాటు సక్సెస్ లతో కొనసాగుతున్నారు. ఇటీవల త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ దాని అనంతరం సుకుమార్ తీసిన పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియన్ రేంజ్ లో మంచి పేరుని అలానే అందులో అద్భుత నటనకు గాను నేషనల్ అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న పుష్ప 2 లో నటిస్తున్నారు.

అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా వైసిపి నంద్యాల అభ్యర్థి శిల్పా రవి చంద్రశేకిషోర్ రెడ్డికి ప్రత్యేకంగా కలిసి మద్దతిచ్చారు అల్లు అర్జున్. దానితో పలువురు మెగా ఫ్యాన్స్ లో ఆ ఘటన పై అసంతృప్తి ఏర్పడడంతో పాటు అనేకులు ఆయన పై విమర్శలు చేసారు.

తాజాగా ఆ ఘటన పై ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ, వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు, ఇష్టాలు వారివని అయితే దాని పై కుటుంబంలో ఎవరికీ ఎటువంటి వ్యతిరేకత లేదని అన్నారు. కాగా ఆమె మాటలను బట్టి మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఉందని అర్ధమవుతోంది. అయితే అప్పట్లో దీనికి సంబంధించి నాగబాబు పరోక్షంగా వేసిన ట్వీట్ ని తాజాగా కొందరు అల్లు అర్జు ఫ్యాన్స్ ప్రస్తావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version