చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రచారం సరిగా చేసుకుంటేనే పెట్టిన డబ్బులకు, పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది.తొంభై ఏళ్లకు పైగా ప్రస్థానం ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నో రకాల పబ్లిసిటీ టెక్నిక్ లను ఉపయోగించుకుంది.
ఇక గత 20 ఏళ్ళ నుంచి సోషల్ మీడియా ప్రభంజనం మొదలయ్యాక మరిన్ని కొత్త పుంతలు తొక్కింది.కరోనా ప్యాన్డేమిక్ తరువాత పబ్లిసిటి అనేది మరింత ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఎక్సయిట్ చేసే ఎలిమెంట్ లేకపోతే ప్రేక్షకులు ధియేటర్ ల వైపే రావట్లేదు.
ఈ సంవత్సరం రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్ల పెంచడం జరిగింది.దాని వల్ల ఆర్ ఆర్ ఆర్, కేజిఎఫ్ వంటి ఈవెంట్ సినిమాలకి ఓపెనింగ్స్ బాగా కలిసి వచ్చినా ఇతర సాధారణ కమర్షియల్ సినిమాలకూ, ముఖ్యంగా చిన్న సినిమాలకు ఈ టికెట్ రేట్ల వల్ల నష్టమే జరిగింది.అందుకే ఇప్పుడు మూవీ మేకర్స్ కొత్త పద్ధతుల్లో పబ్లిసిటీ చేయడం ప్రారంభించారు.
మేజర్ చిత్రానికి ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే 50 రూపాయలు తగ్గించాము అని ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరో సినిమా అదే పద్ధతిని పాటించనుంది.
పక్కా కమర్షియల్ చిత్రానికి తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ లకి 112, మల్టీప్లెక్స్ కి 175 లేదా 180 రేట్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే మా సినిమా ఓటీటీ లో కూడా వీలయినంత ఆలస్యంగా వస్తుంది అనే అంశం కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు నిర్మాతలు.