తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2001లో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు జక్కన్న రాజమౌళి. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా ఒక్క అపజయం కూడా లేకుండా ఇటీవల బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ కి పెంచారు రాజమౌళి.
ఆ విధంగా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న రాజమౌళి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో జంగిల్ బేస్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 తెరకెక్కించనున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా మన జక్కన్న పై ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు ఒక డాక్యుమెంటరీ రూపొందించారు.
ఒక మనిషి, అనేక బ్లాక్ బస్టర్స్, అంతులేని ఆశయం, ఇక ఈ లెజెండరీ దర్శకుడు తన కెరీర్ కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఎంత సమయం పట్టింది వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో తెలిపింది. ఇంకా ఈ డాక్యుమెంటరీలో పలువురు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్ జక్కన్న గురించి తమ అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు. మొత్తంగా ఈ అంశాలతో రూపొందిన ఈ డాక్యుమెంటరీని ఆగష్టు 2న నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది.