నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తాజాగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ NBK 109. ఈ మూవీపై ప్రారంభం నాటి నుంచి బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో బేబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క టైటిల్ టీజర్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ని కొద్దిసేపటికి మేకర్స్ అయితే అందించారు. నవంబర్ 15 న ఉదయం 10:24 నిమిషాలకు ఈ మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా రిలీజ్ చేస్తామని మేకర్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేశారు.
బాలకృష్ణ మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఆకట్టుకునే కథ కథనాలతో దర్శకుడు బాబి ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారని తప్పకుండా రిలీజ్ అనంతరం ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఆడియన్స్ ముందుకు తీసుకురనున్నారు మేకర్స్.