నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ NBK 109. త్వరలో టైటిల్ అనౌన్స్ కానున్న ఈ మూవీలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు గ్రాండ్ గా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ పై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవల NBK 109 నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి .విషయం ఏంటంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక సెన్సేషనల్ అప్ డేట్ అందించారు.
రేపు దసరా పండుగ సందర్భంగా మూవీ యొక్క రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అన్నారు. అలానే దీపావళి పండుగ రోజున అఫీషియల్ టైటిల్ తో పాటు టీజర్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు బాబీ తీస్తున్న ఈ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.