టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ NBK 109. త్వరలో అఫీషియల్ టైటిల్ అనౌన్స్ కానున్న ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న ఈ మూవీలో ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అంచనాలు మరింత పెంచిన ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ తాజాగా లాక్ అయినట్లు తెలుస్తోంది.
తొలుత ఈ మూవీని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేద్దాం అని భావించారు, అయితే పుష్ప 2 కోసం ఆ డేట్ లాక్ చేయడంతో వద్దనుకున్నారు. అనంతరం క్రిస్మస్ కి రిలీజ్ అనుకోవడంతో అప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లాక్ అవడంతో ఇక సంక్రాంతికి ఫిక్స్ చేసారు. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 9న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.