నయనతార నటించిన కనెక్ట్ గత వారం విడుదలై విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలతో పాటు ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ ను తెచ్చుకుంది. తన బిడ్ద భయంకరమైన అనుభవాలు మరియు పారానార్మల్ సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు వాటిని ఎదురుకునే ఒంటరి తల్లిగా నయనతార నటనను విమర్శకులు మరియు ప్రేక్షకులు ప్రశంసించారు.
కాగా ఇప్పుడు కనెక్ట్ సినిమా ఓటిటి విడుదల ఖరారు చేయబడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ హారర్ థ్రిల్లర్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అయెందుకు సిద్ధం అవుతుంది.
ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్య సౌత్ సినిమాలను ఎక్కువగా కొంటున్న ఈ ఓటీటీ దిగ్గజం త్వరలోనే కనెక్ట్ సినిమా యొక్క ఓటిటి విడుదల తేదీని ప్రకటించనుంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రన్ లేదు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కనెక్ట్ ఓటీటీ విడుదల సాధారణ గ్యాప్ కంటే ముందే జరగవచ్చు.
అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ నిర్మించారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం భూతవైద్యానికి సంభందించిన ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకుంది. ఆ విద్య ద్వారా ఆత్మలను వేటాడే ఈ తాజా విధానం చాలా మంది చేత ప్రశంసించబడింది.
బలమైన తారాగణం మరియు చక్కని నిర్మాణ విలువలు ఉన్నప్పటికీ, కనెక్ట్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని సృష్టించడంలో విఫలమైంది మరియు యావరేజ్ రన్నర్ గా ముగిసే మార్గంలో ఉంది.
కేవలం 99 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను మొదట్లో ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. అయితే థియేటర్ యజమానుల నుంచి ఈ ఆలోచనకు వ్యతిరేకత రావడంతో విరామం ఉండేలా నిర్మాతలు మళ్ళీ మార్పులు చేశారు.