మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం విశ్వంభర మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా బాగానే అంచనాలు ఉన్నాయి.
త్వరలో దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ అయితే కసరత్తు చేస్తోంది. మరోవైపు తాజాగా శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి లతో రెండు సినిమాలు అనౌన్స్ చేసారు మెగాస్టార్. అయితే వీటిలో అనిల్ రావిపూడి మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార ని ఫిక్స్ చేసారు. కాగా ఆమెకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో బైట్ రిలీజ్ చేసారు మేకర్స్. సాధారణంగా మూవీ ప్రమోషన్స్ విషయంలో దూరంగా ఉండే నయనతార, మెగాస్టార్ మూవీ అనౌన్స్ మెంట్ కి సరదాగా వీడియో బైట్ ఇవ్వడం విశేషం.
ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తుండగా మెగాస్టార్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు తన మార్క్ కామెడీ అంశాలు కూడా జోడించి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. కాగా ఈమూవీ 2026 సంక్రాంతికి గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.