తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడునరేష్ జీవితంలో వరుస వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సంతకాలను ఫోర్జరీ చేశారని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి ఆయన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నరేష్ తన పై నిరాధారమైన, క్రూరమైన ఆరోపణలు చేశారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని రమ్య రఘుపతి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రాణహాని ఉందని నరేష్ తనకు ఇంజక్షన్ ఆర్డర్ పంపారని ఆమె వెల్లడించారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ నిషేధాజ్ఞ (injuction order) ఉత్తర్వులలో కృష్ణ గారి అన్ని సంతకాలు వేర్వేరు శైలులలో ఉన్నాయని, వాస్తవానికి ఆ సంతకాలు అన్నీ నరేష్ యే చేశారని, ఇది ఫోర్జరీకి సమానమని ఆమె వెల్లడించారు.
నరేష్, రమ్య రఘుపతి గతంలో ఒకరి పై ఒకరు అనేక బహిరంగ ఆరోపణలు చేసుకున్నారు. గత ఏడాది ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భార్య గురించి కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసి, కొంతకాలంగా ఆమె తనను మానసికంగా వేధిస్తోందని మీడియాకు చెప్పారు. ఆమె భయంకరమైన ప్రవర్తన మరియు అక్రమ సంబంధాలకు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆమె తనకు వ్యతిరేకంగా మరిన్ని ప్రకటనలు చేయడం కొనసాగిస్తే తాను చట్టపరమైన మార్గాన్ని తీసుకుంటానని నరేష్ తెలిపారు.
ఏదేమైనా సినీ నటుల వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి విషయాలు ఈ విధంగా బయటకి రావడం చాలా బాధాకరం అనే చెప్పాలి.