జూన్ 10 న విడుదల అయిన అంటే సుందరానికీ చిత్రం తొలిరోజు రివ్యూస్ ముఖ్యంగా సోషల్ మీడియా లో చక్కటి స్పందనను రాబట్టుకుంది.
అయితే నాని ప్రస్తుతం ఉన్న బ్యాడ్ ఫేజ్ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు సినిమాకి రావాల్సిన క్రేజ్ రిలీజ్ కు ముందు రాలేదు.కనీసం విడుదల అయిన తరువాత టాక్ వల్ల అయినా కలెక్షన్ లు పెరుగుతాయి అని పలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశించారు.
అయితే ఆ అంచనాలు అన్నీ తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద “అంటే సుందరనికీ” చతికిలబడింది. ఓపెనింగ్స్ నాని స్తాయిలో అసలు లేవు. ఇక రెండో రోజు నుంచి కాస్త నిలదొక్కుకుంటుంది అనుకుంటే ఏ మాత్రం చలనం లేకుండా పరిస్తితి.
పోయిన వారం విడుదల అయిన “విక్రమ్” కన్నా చాలా చోట్ల “అంటే సుందరానికీ” కలేక్షన్లులు తక్కువగా ఉండటం గమనార్హం. తొలి మూడు రోజుల్లోనే సినిమా రన్ అయిపోయిందా అనే అనుమానం కలిగించేలా సాగిన సుందరం బాక్స్ ఆఫీస్ ప్రయాణం ఇక ఎక్కడ ఆగుతుందో చూడాలి.