Homeసినిమా వార్తలుదారుణమైన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న నాని అంటే సుందరానికీ

దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న నాని అంటే సుందరానికీ

- Advertisement -

ఒకప్పుడు వరుస విజయాలతో నిలకడగా కెరీర్లో ముందుకి దూసుకుపోతూ బాక్సాఫీసు వద్ద ఖచ్చితంగా లాభాలను అందిస్తాడు అనే హీరోగా పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తన థియేట్రికల్ మార్కెట్ ను కోల్పోయినట్లు కనిపిస్తుంది. నాని నటించిన ఇటీవలి చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి లేదా థియేట్రికల్ రన్‌లో ఊహించిన దానికంటే తక్కువ కలెక్షన్లను వసూలు చేశాయి.

నాని లేటెస్ట్ మూవీ “అంటే సుందరానికీ” చిత్రానికి మంచి టాక్ వచ్చినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది, కాగా టీవీలో కూడా అదే ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇటీవలే జెమినీ టీవీలో జరిగింది. నాని మార్కెట్ ధర కంటే దాదాపు రెట్టింపు ధరకు ఛానల్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది.

కానీ రేటింగ్స్ మాత్రం షాకింగ్ గా వచ్చాయి. “అంటే సుందరానికీ” సినిమాకి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. ఏకంగా 1.88 TRP ని సాధించడం అనేది చాలా దారుణం అనే చెప్పాలి. టీవీలో సినిమా ప్రీమియర్లలోనే ఇది అత్యల్ప రేటింగ్. పండగ సెలవులలో కూడా ఈ సినిమాను చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

READ  యూట్యూబ్ ఛానళ్ల పై కేసు పెట్టనున్న సమంత

నిజానికి ధియేటర్లలో విడుదలైన రోజు ఈ సినిమాకు రివ్యూలు చాలా బాగా వచ్చాయి. కానీ తీరా చూస్తే సినిమా కలెక్షన్స్ రెండు రోజుల తర్వాత ఒక్కసారిగా పడిపోయాయి. విడుదలకు ముందు సినిమాలోని పాటలు సినిమా పై కాస్త హైప్ కూడా తీసుకు రాలేకపోయాయి. ఇక కామెడీ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్స్ బాగా తీసినా.. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉన్నాయని, ఒకటి రెండు పాయింట్లు కాకుండా సినిమాలో చాలా అంశాలు జోప్పించారు అనే స్పందన వచ్చింది.

ఇక ఈ సినిమాకు ఓటిటిలో చాలామంది చూశారు అని, నెట్ ఫ్లిక్స్ లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయింది అని అప్పట్లో చెప్పారు. కానీ టీవీలో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో దారుణమైన స్పందన అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నానికి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న ఆదరణ వల్ల సినిమాకు టెలివిజన్ ప్రీమియర్లో కనీసం 10 రేటింగ్ అయినా వస్తుంది అని ఆశించారు కానీ ఇంత తక్కువ వస్తుందని బహుశా ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు.

READ  "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం నుండి "చాలాబాగుందే" లిరికల్ వీడియో విడుదల

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories