Homeసినిమా వార్తలుఅంటే సుందరానికీ OTT రిలీజ్ కి కుదిరిన ముహూర్తం

అంటే సుందరానికీ OTT రిలీజ్ కి కుదిరిన ముహూర్తం

- Advertisement -

నాని హీరోగా, నజ్రియా నజీం హీరోయిన్ గా నటించిన సినిమా “అంటే సుందరానికీ”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సినిమా విడుదలైన రోజు రివ్యూల వరకూ మంచి స్పందన వచ్చినా,ప్రేక్షకులు థియేటర్ల వైపుకు అస్సలు కదలకపోవడంతో..మౌత్ టాక్ అనుకున్న స్ధాయిలో పెరగకుండా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది.

మంచి కథా కథనాలు, చక్కని పాత్ర చిత్రణ, ఆరోగ్యకరమైన హాస్యం తో పాటు గా,హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉండి కూడా ఎందుకు ఈ సినిమా విఫలమైంది అనేది చిత్ర బృందంతో పాటు ట్రేడ్ వర్గాలకూ అంతు చిక్కలేదు.

స్వతహాగా నాని సినిమాలకు పర్వాలేదు అన్న టాక్ వచ్చినా చాలు ప్రేక్షకులు సినిమా చూస్తారనే భావన అందరిలో ఉండేది.అయితే కరోనా వేవ్ ల వల్ల ఓటిటికి ఒక వర్గం ప్రేక్షకులు అలవాటు పడటం వల్ల కావచ్చు,సినిమా రిలీజ్ కు ముందు హైప్ తెచ్చి పెట్టే పాటలు లేకపోవడం వల్ల కావచ్చు.లేదా వేసవిలో ఒకదాని తరువాత ఒకటి సినిమాలు వరుసగా రిలీజ్ అయి ప్రేక్షకులకి మొహం మొత్తటం కూడా ఒక కారణం కావచ్చు.కారణాలు ఏవైనా అంటే సుందరానికీ పరాజయం అందరినీ విస్మయానికి గురి చేసింది.

READ  సూర్యకు దక్కిన అరుదైన గౌరవం

ఇక థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు(జూలై 10) అంటే సుందరానికీ OTT లో రిలీజ్ అవబోతుంది.సినిమా కంటెంట్ క్లాస్ ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యే తరహాలో ఉంటుంది కాబట్టి కనీసం OTT lo అయినా ఈ సినిమా ఆశించిన ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ దక్కుతుంది అని ఆశిద్దాం.

https://twitter.com/Netflix_INSouth/status/1543542567274512385?t=zcpHZzvyYF3e3s7TD6XgXg&s=19

ఇక నాని తదుపరి చేయబోయే సినిమా “దసరా”.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నేను లోకల్’ తరువాత నాని – కీర్తి సురేశ్ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావటం విశేషం.ఇక సినిమాలో నాని తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడిగా కనిపించనున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-Office: నాని అంటే సుందరానికీతో మళ్ళీ కొట్టాడు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories