గత కొంత కాలంగా హీరోలు నాని, విజయ్ దేవరకొండ మధ్య సత్సంబంధాలు లేవని, ఒకప్పుడు వారి మధ్యలో ఉన్న స్నేహబంధం తెగిపోయిందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేశాయి. 2015లో విడుదలైన ఎవడే సుభ్రమణ్యంలో వీరిద్దరూ కలిసి నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేచురల్ స్టార్ కథానాయకుడిగా నటించగా, విజయ్ దేవరకొండ నాని చిన్ననాటి స్నేహితుడిగా నటించారు.అప్పటి నుండి, విజయ్ టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని ఎదుగుదలను చూశారు. అంత కాకుండా తనకంటూ ఒక స్టార్‌డమ్ మరియు మార్కెట్ ను సంపాదించుకుని తన కన్నా ముందు వచ్చిన సీనియర్ హీరోలను కూడా అధిగమించారు. అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం వంటి భారీ విజయాలు విజయ్ ను తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త స్టార్‌గా మార్చాయి. అయితే, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి పరాజయం, తాజాగా లైగర్ రూపంలో మరో భారీ డిజాస్టర్ ఇలా వరుస ఫ్లాప్‌లతో, విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ తీవ్రంగా దెబ్బతింది.
కాగా తాజాగా సోషల్ మీడియాలో లైగర్ సినిమా కోసం నాని ఇటీవలే శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ ల వెనుక ఉద్దేశ్యం నిజంగా మంచిని కోరి చేసినది కాదు అన్నట్లుగా ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా నాని విజయ్ దేవరకొండ ట్వీట్ కు ఇచ్చిన రిప్లై ట్వీట్ లో మద్దతు కంటే వ్యంగ్యమే కనిపిస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. సినిమా ఫలితం తెలుసుకున్న తర్వాత.. నాని ఉద్దేశ్యపూర్వకంగానే రిప్లై ఇచ్చారని ట్విట్టర్ లో ప్రేక్షకులు భావించారు.
ఇదిలా ఉండగా నాని తదుపరి చేస్తున్న చిత్రం దసరా సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో, కొత్త శైలిలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. నేను లోకల్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ నాని సరసన కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరో వైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఆశలన్నీ దర్షకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ పైనే పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది మొదట్లో విడుదలకు సిద్ధమవుతుంది.