నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హీరోగా ఒక్కో సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ ని అలానే సక్సెస్ లని అందుకుంటూ ఫ్యాన్స్ ఆడియన్స్ ని మెప్పిస్తూ కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఓవైపు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అలానే మరోవైపు సుజిత్ తో మరొక గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ చేస్తున్నారు నాని.
ఈ రెండు సినిమాల పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచాయి. ఇక ఇటీవల యువ దర్శకడు శ్రీకాంత్ ఓదెలతో పాన్ ఇండియన్ మూవీ దసరా చేసారు నాని. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది.
విషయం ఏంటంటే, త్వరలో శ్రీకాంత్ తో నాని మరొక మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాస్ యాక్షన్ తో 1990ల కాలం నాటి కథగా సాగనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఆ విధంగా తొలిసారిగా జాన్వీతో నాని జతకట్టబోతున్నారన్నమాట. త్వరలో ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.