ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ నటునకు అందరి నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ మూవీ యొక్క ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కేసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా మారింది. దానితో పోలీసులు సంధ్య థియేటర్ పై అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు.
ఇక నేడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరు పరిచారు పోలీసులు. ఇక అల్లు అర్జున్ కి కొద్దిసేపటికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై కొద్దిసేపటి క్రితం హీరో నాచురల్ స్టార్ నాని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ విధమైన విషాద ఘటన జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా ఆ ఘటనలో మహిళ మృతి చెందటం ఎంతో బాధగా ఉందన్నారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మరియు మీడియా లాంటి ఉత్సాహం సాధారణ పౌరులకు కూడా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. మనం మంచి సమాజంలో జీవించేవాళ్లం.
మనమందరం విపత్తు నుండి నేర్చుకోవాలి మరియు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇది మళ్లీ జరగకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడనేది ఆలోచన చేయండని కోరారు. మొత్తంగా ఇటువంటి క్లిష్ట సమయంలో అల్లు అర్జున్ కి మద్దతుగా నాని నిలిచారు.