ఇటీవల వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి విజయం అందుకున్న న్యాచురల్ స్టార్ నాని. కాగా ఆయన ప్రస్తుతం హిట్ 3 మూవీ చేస్తున్నారు. ఈ మూవీపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక దీని అనంతరం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ మూవీ చేయనున్నారు నాని. అతి త్వరలో ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ టీజర్ కూడా రానుంది. ఇక ఈ రెండిటి అనంతరం తాజాగా తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో కూడా ఒక మూవీ చేసేందుకు నాని సిద్ధమయ్యారు.
వాస్తవానికి హిట్ 3, ది పారడైజ్ తో పాటు సుజిత్ తో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారు నాని. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి మూవీని సుజిత్ తీస్తుండటంతో అది కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. అందువలన సుజీత్ మూవీని ప్రస్తుతం ప్రక్కన పెట్టారు నాని. దానితో సిబి చక్రవర్తితో నాని చేయనున్న సినిమా ప్రస్తుతం లైన్ లోకి వచ్చింది.
వాస్తవానికి శిబి చక్రవర్తి, శివ కార్తికేయన్ తో సినిమా చేయాల్సి ఉంది కాగా ప్రస్తుతం ఆయన సుధా కొంగరతో పరాశక్తి మూవీ చేస్తున్నారు. దానితో నాని మూవీ చేయడానికి ఆయనకు లైన్ క్లియర్ అయింది. త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.