Homeసినిమా వార్తలుప్రేక్షకుల నుండి నాని దూరం అవుతున్నాడా?

ప్రేక్షకుల నుండి నాని దూరం అవుతున్నాడా?

- Advertisement -

సినీ పరిశ్రమలో యే బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగి నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. ఎప్పటికప్పుడు కొత్త దర్శకులతో పని చేస్తూ, చేసే ప్రతీ సినిమాకి ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుంటూ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాడు. స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా పక్కాగా ఉంఉంట.

భలే భలే మగాడివోయ్ సినిమా తరువాత అతడి బాక్స్ ఆఫీస్ స్టామినా కూడా కాస్త పెరిగిన మాట వాస్తవమే. ఆ పై నేను లోకల్, MCA వంటి వరుస విజయాల తరువాత అతగాడి రేంజ్ యే మారిపొతుంది అనుకున్నారు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు.

అయితే అన్ని రోజుులూ ఒకేలాగా ఉండవు. కేవలం ఒక్క సినిమాతో పైకి వెళ్లిన సందర్భాలు ఉన్నట్టే ఒక్కోసారి కిందకీ పడిపోవచ్చు. కృష్ణార్జున యుద్ధం సినిమా పరాజయం తరువాత నానికి సరైన హిట్ లేకపోగా, v, టక్ జగదీష్ రెండు సినిమాలు వరుసగా ott లో విడుదల అవడం తన కెరీర్ కి మరింత చెడు చేసింది అనే చెప్పాలి.

READ  ఖైదీ 2 లో అలరించనున్న ఢిల్లీ కబడ్డీ

శ్యామ్ సింఘా రాయ్ చిత్రానికి మంచి టాక్ వచ్చినా, అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. జస్ట్ బ్రేక్ ఈవెన్ స్టేటస్ సంపాదించుకుంది.

ఇక నాని కొత్త సినిమా “అంటే సుందరానికీ” అడ్వాన్స్ బుకింగ్ కూడా అంత ఆశాజనకంగా లేకుండా పోయింది. చాలా చోట్ల ఇటీవల విడుదల అయిన “మేజర్” కంటే తక్కువ ఉండటం గమనార్హం.”అంటే సుందరానికీ” కాంబినేషన్ ప్రకారం చూస్తే అసలు సూపర్ హిట్ పక్కా అనిపించే విధంగా ఉంటుంది కానీ పైన చెప్పుకున్న కారణాల వల్ల ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుండి ఆసక్తి కనిపించలేదు. అయితే సినిమాకి రివ్యూలతో పాటు ప్రేక్షకుల్లో మంచి టాక్ కూడా వచ్చింది.

చాలా కాలానికి తనదైన శైలిలో ఉన్న పాత్ర/సినిమా పడటం నానికి కలిసి వచ్చి రేస్ లో బౌన్స్ బ్యాక్ అవుతాడు అని ఆశిద్దాం.



		

Follow on Google News Follow on Whatsapp

READ  ఖైదీ 2 లో అలరించనున్న ఢిల్లీ కబడ్డీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories