మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా విశ్వంభర. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని యువి క్రియేషన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది.
త్వరలో రిలీజ్ డేట్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ టీం అందించనుంది. అయితే విషయం ఏమిటంటే దీంతోపాటు ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టారు మెగాస్టార్. అందులో ఒకటి అనిల్ రావిపూడి తో మూవీ కాగా మరొకటి శ్రీకాంత్ ఓదెల మూవీ.
ఈ రెండు సినిమాల యొక్క అనౌన్స్మెంట్ ఇటీవల వచ్చాయి. తాజాగా అనిల్ రావిపూడి సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. విషయం ఏమిటంటే శ్రీకాంత్ ఓదెల సినిమాలో మెగాస్టార్ పాత్ర గతంలో ఆయన పోషించిన పలు యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ అంశాల కలబోతుగా ఉండనుందట.
ఈ సినిమా గురించి తాజాగా న్యాచురల్ స్టార్ నాని ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారంటే కేవలం యాక్టింగ్, స్టైల్ అలానే పవర్ఫుల్ డాన్సులు మాత్రమే మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ, ఒకరకంగా ఆయన మనందరి ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు.
ఈ రోజుల్లో మీరందరూ ఆయన నుండి ఏమి మిస్ అవుతున్నారో దానిని తిరిగి తీసుకురావడానికి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారని, తప్పకుండా ఆ మూవీ పెద్ద విజయం అందుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు నాని. త్వరలో ఈ సినిమా యొక్క షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది.