టాలీవుడ్ స్టార్ నటుడు నాచురల్ స్టార్ నాని తొలిసారిగా అష్టాచమ్మా మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అంతకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నాని, హీరోగా నటించిన ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్నారు.
ఇక అక్కడి నుండి కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ కొనసాగిన నాని, ఇటీవల మంచి సక్సెస్ లతో ఊపు మీదున్నారు. 2023లో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ఆయన చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దసరా. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఇక ఇటీవల యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఆయన చేసిన హాయ్ నాన్న, అలానే తాజాగా వివేక్ ఆత్రేయతో చేసిన సరిపోదా శనివారం మూవీస్ తో మరొక రెండు విజయాలు సొంతం చేసుకున్నారు నాని.
హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్న నానికి ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియన్స్ లో బాగా క్రేజ్ ఉంది. దానితో తాజాగా ఆయన తన రెమ్యునరేషన్ ని పెంచేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్. ప్రస్తుతం ఆయన ఒక్కో మూవీకి రూ. 35 కోట్ల మేర తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.