Home సినిమా వార్తలు Dasara: దసరా కూడా బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ లాగా సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్న నాని

Dasara: దసరా కూడా బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ లాగా సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్న నాని

నాని నటించిన దసరా సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది మరియు రోజురోజుకూ ఈ సినిమా పైన అంచనాలు పెరుగుతున్నాయి. అద్భుతమైన పాజిటివ్ బజ్ మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల బిజినెస్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక దసరా పై హీరో నాని చాలా అంచనాలు పెట్టుకున్నారు మరియు సినిమా చూసిన తర్వాత ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం తనకు తెలుగులోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో కూడా బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందని నాని నిజంగా ఆశిస్తున్నారు. అలానే ఈ సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేసేందుకు దసరా టీమ్ సన్నాహాలు చేస్తోంది.

ఇక అనుకున్నట్లు ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తే అలా జరిగే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే కంటెంట్ బాగుంటే, ఏ సినిమా అయినా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయగలదు. బాహుబలి, KGF, పుష్ప మరియు ఇటీవల కాంతార అక్షే కార్తికేయ 2 వంటి చాలా ఉదాహరణలు మనం చూశాము, అవి స్టార్ పవర్ లేకపోయినా, అద్భుతమైన వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరాలో ప్రధాన పాత్రలో నానితో పాటు ఆయనకి జోడీగా కీర్తి సురేష్ నటించగా, సాయి కుమార్ మరియు షైన్ టామ్ చాకో తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మార్చి 30, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version