అంటే సుందారానికీ సినిమా కి వచ్చిన టాక్ కీ నమోదవుతున్న కలేక్షన్ లకు ఎక్కడా పొంతన లేదు అన్నమాట వాస్తవం.
కారణాలు ఎన్నైనా కావచ్చు ఏదైనా కావచ్చు సినిమాకి మరీ నామమాత్రపు వసూళ్లు లభిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతటికీ కారణం ప్రేక్షకుల బ్యాడ్ టేస్ట్ యే అని చిత్ర బృందం అభిప్రాయపడుతోందిి.
సినిమా నిడివి తగ్గించటం పై మాట్లాడుతూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ నిడివి సినిమాకు అవసరమేనని చెప్పుకొచ్చారు. మొదటి భాగంలో బాల్యపు సన్నివేశాలు అలా చూపించడం వల్లే రెండవ భాగంలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ లు నిలబడ్డాయి అని ఆయన ఉద్దేశం.
ఇక సినిమా హీరో నాని వాదన మరోలా ఉంది. మూస ధోరణి ఉన్న సినిమాలు చేసినప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయమని, కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీసినప్పుడు ఎమో ఫార్ములా సినిమాలు తీయమంటే ఎలా అని కాస్త సున్నితంగానే ప్రేక్షకులను మందలించాడు నాని.
కర్ణుడు చావుకు కారణాలు ఎన్నో అన్నట్టు అంటే సుందరానికీ చిత్ర వైఫల్యం వెనుక చాలా అంశాలే దాగి ఉండచ్చు. ఏమైనా ఒక మంచి సినిమా పొందాల్సిన స్థాయిలో ఆదరణ లభించకపోవడం అనేది బాధాకరమైన విషయమే.