Home సినిమా వార్తలు Nandhamuri Mokshagna పాన్ ఇండియన్ డెబ్యూ కి రెడీ అయిన నందమూరి మోక్షజ్ఞ

Nandhamuri Mokshagna పాన్ ఇండియన్ డెబ్యూ కి రెడీ అయిన నందమూరి మోక్షజ్ఞ

Nandhamuri Mokshagna

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న శ్రీ ఎన్టీ రామారావు గారి తనయుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి చిత్రం నుండి ఎందరో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని తన అద్భుత నటనతో అలరిస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇంకా పలు మంచి చిత్రాలు చేస్తూ కొనసాగుతున్న బాలకృష్ణ నటవారసుడైన నందమూరి మోక్షజ్ఞ తేజ మూవీ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సినిమాలకు సంబంధించి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ అతి త్వరలో సినీ అరంగేట్రానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎల్లో కలర్ టీ షర్ట్ లో ట్రెండీ లుక్స్ తో స్పెట్స్ పెట్టుకుని ఉన్న మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియన్ రేంజ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తేజ సజ్జ తో హనుమాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ కోసం ఒక అద్భుతమైన కథని సిద్ధం చేసారని, కాగా పాన్ ఇండియన్ రేంజ్ లో పూర్తి స్క్రిప్ట్ సిద్ధమవుతోన్న ఈమూవీ మోక్షజ్ఞ బర్త్ డే నాడు అనగా సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా అతిరథ మహారథుల సమక్షంలో లాంచ్ కానుందని టాక్. అయితే ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version