Home సినిమా వార్తలు Nandamuri Ramakrishna: నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం

Nandamuri Ramakrishna: నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం

నందమూరి కుటుంబంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈరోజు తెల్లవారు జామున జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10 లో వెళ్తుండగా రామకృష్ణ కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి . అయితే కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.

యాక్సిడెంట్ అయిన స్థలంలో కారును పక్కనే ఉంచి రామకృష్ణ అక్కడి నుండి వెళ్లిపోయారట. ఇక ఈ సంఘటన పై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలిసులు తెలిపారు. అయితే నందమూరి కుటుంబంలో జరుగుతున్న ఈ వరుస ప్రమాదాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

గతంలో కూడా నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్‌లు కారు ప్రమాదం లోనే కన్ను మూశారు. ఇక ఎన్టీఆర్ కు కూడా గతంలో ఒకసారి కారు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ అవ్వడం.. ఇవన్నీ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు.

అయితే నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ గురించి ఆ కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. కాగా యాక్సిడెంట్ కి గురైన కారుని కుటుంబ సభ్యులు తీసికెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

ఇటీవల నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసందే. నారా లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన ఆయన ప్రస్తుతం బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. ప్రస్తుతం తారకరత్న క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version