టాలీవుడ్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2025 జనవరి లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు హిందూపూర్ ఎమ్యెల్యే గా కూడా రాజకీయాల పరంగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇంకోవైపు తన తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం కూడా కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీకి పచ్చ జండా ఊపిన బాలకృష్ణ ఆ మూవీలో ఒక కీలక పాత్ర కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందనుండగా దీనిని సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ మహాభారతం బ్యాక్ డ్రాప్ లో రూపొందనుండగా ఇందులో బాలకృష్ణ శ్రీకృష్ణుడిగా అలానే మోక్షజ్ఞ అభిమన్యుడిగా కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి మైథలాజికల్ మూవీగా ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.