Home సినిమా వార్తలు దసరా పోరు నుంచి తప్పుకున్న బాలయ్య సినిమా?

దసరా పోరు నుంచి తప్పుకున్న బాలయ్య సినిమా?

అఖండ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌లో బాలయ్య మాస్ డైలాగ్స్‌తో మరోసారి అదరగొట్టాడు. గోపిచంద్ మ‌లినేని బాలయ్యను పవర్‌‌ఫుల్‌ గా చూపించారు. బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ ఆయనకు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. బాల‌య్య ఇమేజ్‌కు త‌గ్గట్లు మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో మూవీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ ను విపరీతంగా ఎంజాయ్ చేసిన బాలయ్య అభిమానులు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ముందు నుంచీ ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావచ్చు అని తెలుస్తుంది. అయితే షూటింగ్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందా లేదా ఇతర కారణాల వల్లా అనేది తెలియరాలేదు. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా, ముఖ్య పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించబోతున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

దసరాకు బాలయ్య సినిమా రాని పక్షంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ ( మలయాళం లూసిఫర్ కి రీమేక్) తో పాటు అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక బాలయ్య సినిమా దసరా రేస్ నుంచి తప్పుకున్నాక దీపావళి లేదా అఖండ చిత్రం విడుదల అయిన రోజునే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ విషయం అభిమానులకు కాస్త నిరాశ కలిగించేదే అయినా, సినిమా మరింత నాణ్యంగారావడం కోసం కాస్త ఆలస్యం అయినా తప్పు లేదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version