నటసింహం నందమూరి బాలకృష్ణ కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవలే బాలకృష్ణకు కరోనా (Covid) పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు.అయితే డాక్టర్ల సలహాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన కొద్దీ రోజులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా తాజాగా జరిపిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ రావటంతో బాలకృష్ణ కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు.ఈ వారం ఆయన రెస్ట్‌లో ఉండి వచ్చే వారం నుంచి షూటింగ్ లలో పాల్గొంటారని సమాచారం.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను రూపొందిస్తున్నారని ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అన్నగారు అనే టైటిల్ పరిశీనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరో వైపు బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు రావిపూడికథను దాదాపు సిద్ధం చేసేసారు అని తెలిసింది. ఆ సినిమా సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. గత ఏడాది బాలకృష్ణ అఖండ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో బాలకృష్ణ, క్రాక్ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా అవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.