అఖండ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ ఆ తరువాత వెంటనే గోపీచంద్ మలినేనితో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని ప్రారంభించారు. NBK107 గా వర్కింగ్ టైటిల్ తో ప్రచారం జరుగుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంభందించిన కొత్త షెడ్యూల్ ను ఆగస్ట్ 15 నుండి టర్కీలో భారీగా ప్లాన్ చేసారని తెలుస్తుంది.
అయితే ఇటీవల తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ తీసుకున్న సినిమా షూటింగ్‌ల బంద్ నేపథ్యంలో ఈ షెడ్యూల్ కాస్తా వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఈ విషయం పై చిత్ర హీరో అయిన నందమూరి బాలకృష్ణ కోపంగా ఉన్నారట.. అంతే కాక మొత్తం వ్యవహారం పై నిర్మాతలకు తన మాటలతో గట్టిగా విరుచుకు పడ్డట్టు సమాచారం.
మామూలుగానే సినిమా షూటింగ్ అంటే బోలెడు ఖర్చుతో కూడుకున్న పని.. అలాంటిది ఇంక విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్ అంటే నిజంగానే చాలా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆయా షెడ్యూల్ లలో చాలా మంది ఆర్టిస్టుల కాంబినేషన్ డేట్స్ కూడా పరిగణలోకి తీసుకుని చేస్తారు.. అలాంటి షెడ్యూల్ వాయిదా పడితే మళ్లీ ఆ కాంబినేషన్ డేట్లు సంపాదించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. పైగా ఈ వ్యవహారం అంతటికీ మళ్ళీ అదనపు డబ్బు ఖర్చు అవడం ఖాయం.
ఈ పరిస్థితి పై బాలయ్య చాలా సీరియస్ అయ్యి మైత్రీ మూవీస్ నిర్మాతలతో ఘాటుగా స్పందించారట. అయితే మైత్రీ బృందం అసలు తెలుగు సినీ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించారట. అంతే కాక షెడ్యూల్‌ను వాయిదా వేసే విషయంలో బాలకృష్ణను ఒప్పించారట కూడా.
చాలా సేపు చర్చలు జరిపిన తరువాత కానీ బాలకృష్ణ షూటింగ్ వాయిదా అంగీకరించినా.. అసంబద్ధ షూటింగ్ల బంద్ తో ఆయన ఇంకా చాలా కోపంగా ఉన్నారని సమాచారం. కారణం ఏదైనా కావచ్చు కానీ సినిమా షూటింగులు ఆపేయాలనే ఆలోచనతో మాత్రం బాలకృష్ణ ఏకీభవించక పోవడమే కాకుండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.