అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం “ది ఘోస్ట్” ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గత కొద్ది రోజులుగా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ చిత్రం ఇప్పటివరకు చక్కని ప్రచార కంటెంట్‌తో ప్రేక్షకులలో మంచి బజ్‌ని ఏర్పడేలా చేసింది. టీజర్, ట్రైలర్, మరియు పోస్టర్లు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. కాగా సినిమాలో నాగార్జున లుక్/ గెటప్ కూడా అద్భుతంగా ఉంది.
ఇక ఘోస్ట్ సినిమా కేవలం ప్రేక్షకుల దృష్టిని మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ సినిమా యొక్క నాన్-థియేట్రికల్ మరియు థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఆంధ్ర ప్రాంతం మొత్తం బిజినెస్ 8 కోట్లకు జరిగింది. ఇక నైజాం 6 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లకు జరిగింది.
ఆ రకంగా మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఘోస్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే దాదాపు 16.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే బ్రేక్ ఈవెన్ అవ్వాలి 20 కోట్ల నంబర్ దాటాల్సి ఉంటుంది. కాగా ది ఘోస్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం నెలకొన్న హైప్, బజ్ ప్రకారం కాస్త డీసెంట్ వచ్చినా చాలు, సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నంబర్లను నమోదు చేస్తుంది. అయితే, అదే రోజు విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ నుండి ఈ సినిమాకి ఖచ్చితంగా గట్టి పోటీ ఎదురవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తుండగా, గుల్ పనాగ్, అనికా మరియు రవివర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా పని చేశారు. మార్క్ రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.