Homeసినిమా వార్తలుఆగస్ట్ 25న విడుదల కానున్న నాగార్జున ది ఘోస్ట్ ట్రైలర్

ఆగస్ట్ 25న విడుదల కానున్న నాగార్జున ది ఘోస్ట్ ట్రైలర్

- Advertisement -

అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్’. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి- నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ మరియు ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని అక్టోబర్ 5 న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేసిందీ చిత్ర బృందం. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఖరారు చేశారు.

https://twitter.com/iamnagarjuna/status/1561264272239431682?t=BRNf0328jjYJz75gc5Jd6g&s=19

ఆగస్టు 25 న ది ఘోస్ట్ ట్రైలర్ రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాన్ని ధృవీకరిస్తూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒక పక్క భారీ యాక్షన్ నేపథ్యంతో చేతుల్లో గన్స్ పట్టుకుని నాగార్జున ఉండగా.. మరో పక్క నాగార్జునను సోనాల్ కౌగిలించుకోడం మనం చూడచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కమర్షియల్ సినిమాలే కాకుండా కొత్తదనం కోసం తపిస్తూ ఉంటారు నాగార్జున. ఆఫీసర్ వంటి డిజాస్టర్ తో కాస్త వెనకబడ్డ కింగ్, గత సంవత్సరం వైల్డ్ డాగ్ సినిమాలో నటించారు. ఆ చిత్రంతో నటుడిగా చక్కని ప్రశంసలు దక్కినా..బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేక పోయింది. అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అన్నట్లుగా.. వైల్డ్ డాగ్ విమర్శకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఆ తరువాత ఈ ఏడాది సంక్రాంతికి కొడుకు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. లడ్డుండ.. అంటూ పండగకు సరైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు.

READ  ఆచార్య నష్టాలు - ఒక్క పైసా తిరిగి ఇవ్వని చిరంజీవి - రామ్ చరణ్

కాగా బంగార్రాజు సినిమా, 2016 లో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనాకి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కింగ్ నాగార్జున నటిస్తోన్న `ది ఘోస్ట్` రోల్ కూడా ఎలా ఉంటుందో అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తిస్తుంది.

ఇలా నాగార్జున అటు కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు అలా కొనసాగాలి అంటే ఘోస్ట్ వంటి సినిమాలు భారీ విజయం సాధించాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  Samantha: విడాకుల పై స్పందించిన సమంత


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories