బిగ్ బాస్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన షో ఇదే. అలానే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే తెలుగు రియాలిటీ టీవీ షోలలో బిగ్ బాస్ ఒకటి. కాగా ఈ సంవత్సరం బిగ్ బాస్ తెలుగు మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 నేటి నుండి స్టార్ మాతో పాటు డిస్నీ+హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లో 24/7 ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది.
కాగా బిగ్ బాస్ తెలుగుకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇది వరుసగా నాలుగో సారి కావటం విశేషం. నాలుగు సీజన్ లకు విజయవంతంగా హోస్ట్ గా షోను నడిపించిన నాగార్జున.. ఆ రకంగా బిగ్ బాస్ సీజన్ 6కి నాగార్జున మళ్లీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే మునుపటి సీజన్ల కంటే తన రెమ్యునరేషన్‌ను కూడా నాగార్జున పెంచుకున్నారు, ఈ మేరకు నాగార్జున ప్రతి ఎపిసోడ్‌కు 55 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
మునుపటి సీజన్‌లో, ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 40 లక్షలు అందుకున్నారని సమాచారం, అయితే ఈ సీజన్‌లో, షో హోస్ట్ చేయాలి అంటే తన పారితోషికం పెంచాలని ఆయన కోరారట. కాగా బిగ్ బాస్ సీజన్ 6 లో మొత్తం 30 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అంటే ఈ లెక్కన మొత్తం సీజన్ కు 16.5 కోట్ల భారీ అమౌంట్ ను నాగార్జున సంపాదిస్తున్నారు అన్నమాట.
ఇదిలా ఉండగా, ఈరోజు స్టార్ మాలో సీజన్ 6 భారీ స్థాయిలో లాంచ్ కానుంది. ఈ సీజన్ కూడా ఎప్పటిలానే ఆసక్తికరమైన పోటీదారులతో రసవత్తరంగా ఉండబోతుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే పోటీదారులు వివరాలు మరికొద్ది గంటల్లో వెలువడతాయి. అయితే ఈలోగా ఆ పోటీదారులు వీళ్ళే అన్న జాబితా ఒకటి బయటకు వచ్చింది. వాళ్ళు ఎవరంటే..
యాంకర్ ఉదయ భాను
నేహా చౌదరి
చలాకి చంటి
ఆర్జే సూర్య
యాంకర్ ప్రత్యూష
నిఖిల్
సిర్హాన్
గాయని మోహన భోగరాజు
వర్షిణి
భరత్ (మాస్టర్ భరత్ గా పాపులర్)
స్రవంతి చొక్కరపు
అజయ్
గసగసాల మాస్టర్
సంజనా చౌదరి