టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని ఇటీవల సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ స్పై మూవీ ఏజెంట్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర చేసిన ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అక్కడి నుండి కెరీర్ పరంగా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆలోచన చేసిన అఖిల్ ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. యువి క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న మూవీలో అఖిల్ నటించనున్నారు. యువ దర్శకుడు అనిల్ తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్న ఈ మూవీ పీరియాడిక్ జానర్ లో సాగనుందని టాక్.
విషయం ఏమిటంటే, దీనికంటే ముందు కొడుకు అఖిల్ తో నాగార్జున అక్కినేని చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఒక మంచి రూరల్ యాక్షన్ లవ్ మూవీ నిర్మించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ మూవీతో మంచి విజయం అందుకున్న మురళి కిశోర్ దీనిని రూపొందనుండగా ఇప్పటికే దీని స్క్రిప్ట్ కి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. కాగా ఈ ప్రాజక్ట్ గురించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.