కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. గత వారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద ఆసక్తి బాగా పెరిగింది. ట్రైలర్‌లో కొన్ని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు కళ్ళు చెదిరే, అబ్బురపరిచే విజువల్స్ ఉండటం వలన.. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే ఫ్రెష్ కాన్సెప్ట్ ఉన్న చిత్రంగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ట్రైలర్‌తో సినిమా పట్ల అటు ప్రేక్షకులలో ఇటు ట్రేడ్‌లో సినిమా చాలా మంచి ప్రభావాన్ని చూపించింది, కాగా ఇప్పుడు ది ఘోస్ట్ టీమ్‌కి బిజినెస్ పరంగా చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి అని తెలుస్తోంది. దాదాపు రూ. 20 కోట్ల కంటే పైనే థియేట్రికల్ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇటీవలి టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న చిత్రాల జోరును, ప్రదర్శనను చూస్తుంటే, ట్రేడ్ వర్గాలు ‘ది ఘోస్ట్’ సినిమా కూడా విజయవంతం అవుతుందనే నమ్మకంతో ఈ సినిమాను కొంచెం రిస్క్ చేసైనా అవకాశాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు, ఇందులో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, అంతే కాకుండా ఆయనని ఈ చిత్రంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్‌లో చూస్తామని నాగార్జున చెప్పారు. కాగా ఈ చిత్రం తాలూకు టీజర్ మరియు ట్రైలర్ ను చూసి ఒక వర్గం ప్రేక్షకులు.. ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్ తరహాలో ఉందని, ఎలాగైతే కమల్ కి విక్రమ్ భారీ విజయాన్ని అందించిందో.. ది ఘోస్ట్ చిత్రం నాగార్జునకి అలాంటి విజయం తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు.
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కూడా మరో ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఇతర ముఖ్య తారాగణంగా కనిపిస్తారు.