Homeసినిమా వార్తలుNagarjuna response on N Convention ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధం: నాగార్జున

Nagarjuna response on N Convention ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధం: నాగార్జున

- Advertisement -

సినీ నటుడు అక్కినేని నాగార్జునకి సంబంధించి మాదాపూర్ లో గల ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నేడు ప్రభుత్వ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మిడి చెరువుని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని, మూడున్నర ఎకరాల కబ్జా స్థానంలో ఉన్న ఈ నిర్మాణం చట్ట విరుద్ధమని అధికారులు కూల్చివేశారు. ఉదయం నుండి పలు మీడియా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై తాజాగా అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా స్పందించారు.

స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దానిని వివరించుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.

ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.

READ  Raayan Sequel on Cards 'రాయన్' సీక్వెల్ తెరకెక్కనుందా ?

తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ నాగార్జున తన పోస్ట్ లో తెలిపారు. మరి ఈ కేసు మున్ముందు ఎటువంటి మలుపులు తిరుగుగుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  Game Changer Update 'గేమ్ ఛేంజర్' లో ఆ అంశాలు కూడా ఉంటాయి : డైరెక్టర్ శంకర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories