కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ కూలి. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. తొలిసారిగా లోకేష్ తో రజిని చేస్తున్న మూవీ కావడంతో ఈ రేంజ్ హైప్ దీనికి ఏర్పడింది. విషయం ఏమిటంటే, ఈ మూవీలో సైమన్ అనే పవర్ఫుల్ పాత్రలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
తొలిసారిగా రజినీకాంత్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడం ఆనందంగా ఉందని, అలానే ఖైదీ టైం నుండి లోకేష్ తో వర్క్ చేయాలని ఎదురు చూస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం నాగార్జున తన ట్విట్టర్ లో పోస్ట్ ద్వారా తెలిపారు. మొత్తంగా ఈ మూవీలో నాగ్ కూడా భాగం కావడంతో ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో అనే ఆసక్తి అందరిలో మరింతగా ఏర్పడింది. శృతి హాసన్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ 2025 లో విడుదల కానుంది.