Homeసినిమా వార్తలునాగార్జున - మహేష్ కాంబినేషన్లో సినిమా రానుందా?

నాగార్జున – మహేష్ కాంబినేషన్లో సినిమా రానుందా?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ది ఘోస్ట్ ట్రైలర్ విడుదల సందర్భంగా సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు మరియు నాగార్జున మధ్య ఒక సరదా చిట్ చాట్ జరిగింది. ఆ సంభాషణ చూస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాబోతున్నారనే అనిపిస్తుంది.నాగార్జున మరియు మహేష్ బాబుల కాంబోలో ఒక సినిమా వస్తే. అది ఖచ్చితంగా అభిమానులు మరియు ప్రేక్షకులకు కన్నుల పండగే అని చెప్పాలి.

తాజాగా నాగార్జున స్వయంగా ఈ మల్టీ స్టారర్ సినిమా గూర్చి ప్రస్థావించారు. మహేష్ ది ఘోస్ట్ ట్రైలర్ ను విడుదల చేసిన సందర్భంగా..గతంలో మీ నాన్న (సూపర్ స్టార్ కృష్ణ) గారితో కలిసి సినిమా చేశాను.. మరి మనిద్దరం ఎందుకు చేయకూడదు అన్న తరహాలో మహేష్ బాబు ను నాగార్జున ప్రశ్నించారు.

https://twitter.com/urstrulyMahesh/status/1562821570359623680?t=dnqKonWmnwMeyLgzVFA5VQ&s=19

ఆ ప్రశ్నకు మహేష్ బాబు అందుకు సంతోషంగా ఒప్పుకున్నట్లు సమాధానం ఇచ్చారు. తప్పకుండా మనం ఇద్దరం కలిసి సినిమా చేద్దాం.. అలాంటి రోజు కొసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నట్లుగా మహేష్ బాబు స్పందించారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే.. వీరిద్దరు కలిసి సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగానే కనిపిస్తున్నారు. అయితే అనుకున్నంత సులభం కాదు కదా. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే సినిమాని హ్యాండిల్ చేసే దర్శకులు ఎవరు అనేది ఒక ప్రశ్న.

READ  Box-Office: బాలీవుడ్ లో కార్తీకేయ-2 దక్షిణాదిలో సీతారామం హవా

నాగార్జున – మహేష్ బాబు కలిసి ఒక సినిమాలో నటిస్తే ఖచ్చితంగా అది ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతుంది. గతంలో మహేష్ – వెంకటేష్ ల కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తే నిజంగానే అలాంటి ఫ్యామిలీ సినిమా ఉంటుందా లేక మరేదైనా కథ ఉంటుందా అని సోషల్ మీడియాలో అప్పుడే కథలు, కథనాలు సిద్ధం చేసేస్తున్నారు.

ఇలా అభిమానులు ఈ చిత్రం పట్ల పలు రకాల చర్చలు జరుపుతూ నిజంగా ఈ సినిమా రూపు దాల్చితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న మహేష్ .. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. బహుశా ఆ సినిమా లోనే నాగార్జున నటిస్తున్నారు ఎమో అనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ ఊహ నిజమైతే ఎంతో బాగుంటుంది. వారిద్దరిని కలిపి ఇరు వర్గాల అభిమానులను అలరించే సామర్ధ్యం రాజమౌళి కే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అది నిజమవుతుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

READ  మారుతి తో సినిమా పై ఆందోళనలో ఉన్న ప్రభాస్ అభిమానులు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories