Homeసినిమా వార్తలుTammareddy: ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్ పై దర్శకుడు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యల పై మండిపడిన నాగబాబు, రాఘవేంద్రరావు

Tammareddy: ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్ పై దర్శకుడు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యల పై మండిపడిన నాగబాబు, రాఘవేంద్రరావు

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు తన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పై విరుచుకుపడటంలో దిట్టగా పేరు పొందారు. ఇటీవలే సీనియర్ దర్శకుడు, నిర్మాత మరియు నటుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ బడ్జెట్ 600 కోట్లు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అంతే కాకుండా ఆస్కార్ ప్రచారానికి మరో 80 కోట్లు ఖర్చు చేశారనీ.. అదే 80 కోట్లలో 8 లేదా 10 సినిమాలు తీయొచ్చని ఆయన ఎద్దేవా చేసిన తరహాలో చెప్పారు. తమ్మారెడ్డి చేసిన ఆరోపణలకు నాగబాబు ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ ద్వారా కౌంటర్ చేశారు.

“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం) అని అయన ట్వీట్ చేశారు.

నాగబాబు ట్వీట్ పై మెగా అభిమానులతో పాటు ఇతర నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తమ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ కు నాగబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చినందుకు వారు ఆనందపడ్డారు మరియు ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని అంగీకరించలేని తమ్మారెడ్డి వంటి వ్యక్తులే తెలుగు చిత్ర పరిశ్రమ పేరును చెడగొడుతున్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు.

తమ్మారెడ్డి వ్యాఖ్యల పై నాగబాబు మాత్రమే కాదు, సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కూడా స్పందించారు. మన తెలుగు సినిమాకు, సాహిత్యానికి, దర్శకుడికి, నటులకు గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్నందుకు మనం గర్వపడాలి. అంతే కానీ 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గరేమైనా అకౌంట్ వివరాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.

READ  Balakrishna: తన తాజా వివాదం పై స్పందించి క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

అలాగే జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి దిగ్గజ దర్శకులు డబ్బు తీసుకుని మన సినిమాని పొగుడుతున్నారని నీ ఉద్దేశ్యమా అంటూ తమ్మారెడ్డిని ప్రశ్నించారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories