Home సినిమా వార్తలు Naga Shourya: పబ్లిక్‌గా ప్రియురాలిని దుర్భాషలాడిన ఒక యువకుడి పై ఫైర్ అయిన నాగ...

Naga Shourya: పబ్లిక్‌గా ప్రియురాలిని దుర్భాషలాడిన ఒక యువకుడి పై ఫైర్ అయిన నాగ శౌర్య

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి ప్రశంసలు పొందిన నటులలో ఒకరైన నాగ శౌర్య ఈ రోజు ఒక చిన్న వివాదంతో వార్తల్లో నిలిచారు. ఆయన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మార్చి 17 న విడుదలకు సిద్ధంగా ఉంది, ఇప్పుడు నాగ శౌర్య ఒక వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచాడు. “ఊహలు గుస గుసలాడే” వంటి సినిమాలలో చక్కని నటనకు పేరు తెచ్చుకున్న నటుడు హైదరాబాద్‌లోని రద్దీగా ఉండే రహదారిపై తన ఫోర్-వీలర్ నుండి దిగి, తన లవర్ ను కొట్టిన యువకుడిని ప్రశ్నించారు.

నాగ శౌర్య ఎందుకు అంత ఆవేశపడ్డారు అంటే.. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండగానే గొడవపడ్డారు. అబ్బాయి ఆ అమ్మాయిని చెంప మీద కొట్టడంతో నాగశౌర్య ఒక్కసారిగా కారులో నుంచి దిగి ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? అని వెంటనే తిరిగి క్షమాపణ చెప్పు అని వాగ్వివాదానికి దిగారు. అయితే కొట్టిన వ్యక్తి ఆమె నా లవర్ అంటూ నాగశౌర్యకు సీరియస్ గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. లవర్ అయితే కొడతావా అంటూ నాగశౌర్య కూడా కోపంగా ప్రశ్నిస్తూ అలా చేయడం చాలా తప్పు అని వెంటనే అమ్మాయికి సారీ చెప్పు అని కోపగించుకున్నారు. ఇక చుట్టూ పక్కన వాళ్ళు కూడా నాగశౌర్యకు మద్దతు పలుకుతూ లవర్ ని అలా కొడతావా అని అడిగారు.

ఈ వీడియో వైరల్‌గా మారింది, అయితే ఇది నాగ శౌర్య రాబోయే చిత్రానికి ప్రమోషనల్ వీడియో అని నెటిజన్లలో ఒక వర్గం భావిస్తున్నారు. నిజం ఏమిటో త్వరలోనే తెలిసి పోతుంది కానీ ఇది నిజంగా ఫేక్ వీడియో అయితే, ప్రమోషన్ల కోసం ఇలాంటి చవకబారు వ్యూహాలను అమలు చేసినందుకు నిర్మాతలను, హీరోని ఖచ్చితంగా నెటిజన్లు ట్రోల్ చేస్తారు. అలా కాకుండా జరిగింది నిజమే అయితే, నాగ శౌర్యను ఒక అమ్మాయి పై శారీరక వేధింపులకు వ్యతిరేకంగా నిలబడినందుకు ప్రశంసించాలి.

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగ శౌర్య నటిస్తున్న కొత్త చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి’, ఇందులో మాళవిక నాయర్ కథానాయికగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ కలిసి నిర్మించిన ఈ సినిమాకి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం వివేక్ సాగర్ ఒక పాటను కంపోజ్ చేయగా, మిగిలిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కళ్యాణి మాలిక్ అందించారు. మరియు ఆయన అందించిన ‘కనుల చాటు మేఘమా’ పాట ఇప్పటికే హిట్ అయ్యింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version