Homeసినిమా వార్తలుసారీ ఇప్పుడు కాదు అంటున్న థ్యాంక్ యూ టీమ్

సారీ ఇప్పుడు కాదు అంటున్న థ్యాంక్ యూ టీమ్

- Advertisement -

ల‌వ్ స్టోరి, బంగార్రాజు హిట్ చిత్రాలతో వరుస హిట్స్‌తో దూకుడు మీదున్న అక్కినేని హీరో నాగ చైతన్య హ్యాట్రిక్ హిట్‌పై కన్నేశాడు. విక్రమ్ కె.కుమార్‌ డైరెక్షన్‌ లో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యూ’. రాశీఖన్నా, అవికా గోర్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ ఇటివలే విడుదల చేయగా మంచి స్పందనను రాబట్టింది.

ఇందులో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నాడు. యువసామ్రాట్ గా రొమాన్స్ లో మంచి ఇమేజ్ ఉన్న నాగ చైతన్య ఈ సినిమాలోముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. స్కూల్,కాలేజీ లుక్ లతో పాటు వ్యాపారవేత్తగా నాగ చైతన్య అలరించబోతున్నాడు. గడ్డం గెటప్‌లో చూస్తే, మజిలీ మూవీలో లుక్ గుర్తుకువచ్చింది అని టీజర్ చూసిన ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.

కరోనా వేవ్ ల వల్ల ఇతర సినిమాల లాగే థ్యాంక్ యూ కూడా షూటింగ్ తో పాటు రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు జూలై 8న ఈ సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు చేసినా, తాజాగా అందిన వార్తల ప్రకారం మళ్ళీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.ముందుగా అనుకున్నట్టు జూలై 8న కాకుండా రెండు వారాల తరువాత అంటే జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

READ  త్రివిక్రమ్ చెప్పిన కథ మెచ్చని మహేష్

కారణాలు ఎంటి అనేది తెలియరాలేదు కానీ “థ్యాంక్ యూ” వాయిదా వేయడం మంచి నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే వారం ముందు “పక్కా కమర్షియల్” వారం తరువాత “ది వారియర్” సినిమాలు ఉండటం వల్ల అంత తక్కువ గ్యాప్ లో మరో సినిమా చూడటానికి ప్రేక్షకులు ముందుకు రాకపోవచ్చు. 


మనం’ సినిమా హిట్ తరువాత నాగ చైతన్య-విక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే. ‘థ్యాంక్ యూ’ మూవీ టీజర్ తరువాత ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. డిఫరెంట్ గెటప్ లలో నాగ చైతన్య కనిపించడం, అంతే డిఫరెంట్‌గా స్టోరీ ఉంటుంది అనేలా టీజర్ ఉండటంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో సినిమా ఇలా పోస్ట్ పోన్ చేయడం వాళ్ళకి కాస్త నిరాశ కలిగించినా,ఈ నిర్ణయం వల్ల సినిమాకి మంచి జరిగి మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  ఎట్టకేలకు OTT లో విడుదల అవుతున్న పెళ్ళి సందD


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories