యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ తండేల్. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీని గీత ఆర్ట్స్ సంస్థ పై బన్నీ వాసు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో పాటు తాజాగా రిలీజ్ అయిన బుజ్జి తల్లి అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పర్చాయి. ఈ మూవీని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక నేడు నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్ 24వ మూవీని అనౌన్స్ చేసారు మేకర్స్.
ఇటీవల విరూపాక్ష వంటి హర్రర్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న యువ దర్శకుడు కార్తీక్ దండు దీనిని కూడా తెరకెక్కించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ గ్రాండ్ లెవెల్లో ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని నిర్మించనున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చనున్న ఈ మూవీ యొక్క ఫిస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.