హీరో నాగ చైతన్య – సమంత ల జోడీ మొదటి చిత్రం “ఏ మాయ చేసావే” నుండి చక్కని జోడీగా పేరు తెచ్చుకుని ఆ తరువాత కొన్ని సంత్సరాల పాటు ప్రేమాయణం నడిపి 2017 అక్టోబరులో పెళ్ళి చేసుకున్నారు.చూడముచ్చటగా ఉన్న ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోయారు. ఎప్పటికప్పుడు వారి సోషల్ మీడియా హ్యాండిల్ లలో ఇద్దరి పట్ల వారి ప్రేమను తెలుపుతూ ఆనందించారు. అయితే పెళ్ళైన నాలుగేళ్లకి అక్టోబరు 2021 లో అందరికీ షాక్ ను ఇస్తూ నాగ చైతన్య – సమంత లు తమ వివాహబంధం నుంచి విడిపోతున్నాము అని ప్రకటించారు.
అయితే విడాకుల తరువాత అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఆ విషయం గూర్చి ఎక్కడా ప్రస్తావించకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇదిలా ఉండగా కొంత సమయం నుంచి నాగ చైతన్య మీద పుకార్లు రావడం కాస్త ఎక్కువ అయ్యింది.
ఫలానా నటితో చైతన్యకు ఎఫైర్ ఉంది అని లేదా డేటింగ్ చేస్తున్నారు అని ఇది వరకు కొన్ని సార్లు పుకార్లు రాగా అవి ఏవీ నిజం కాలేదు. తాజాగా మరోసారి ఒక హీరోయిన్ తో చైతన్య పేరు మళ్ళీ వచ్చింది. చైతన్య ఇప్పుడప్పుడే మళ్ళీ పెళ్ళి చేసుకునే ఉద్దేశంలో లేడని,ప్రస్తుతం తన దృష్టి అంతా తన కెరీర్ మీదే ఉంది అని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అయినా ఇలా వ్యక్తిగత జీవితంలోకి చొరబడి అనవసరమైన పుకార్లు లేవదీయడం ఎంత మాత్రం సబబు కాదు. ఈ ఎడతెరిపి లేనిపుకార్లు అన్నీ స్వతహాగా సినిమా ఇండస్ట్రీ లోని వార్తలు లాగా వస్తున్నాయా లేదా ఎవరో వెనక నుంచి ఇదంతా నడిపిస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.అది నిజం అయినా కాకపోయినా ఇలాంటి వ్యక్తిగత ఖననం ఎవరు చేసినా తప్పే.