యువ నటుడు అక్కినేని మూడవతరం వారసుడు నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తండేల్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక నాగచైతన్య కొన్నేళ్ల క్రితం సమంతని వివాహం చేసుకుని కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా అనంతరం ఆమెతో విడిపోయిన విషయం తెలిసిందే.
ఇక గత కొన్నాళ్లుగా యువ నటి శోభిత ధూళిపాళ్లతో కలిసి పలు చోట్ల నాగచైతన్య కనపడుతుండడంతో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.అయితే వాటి పై అటు చైతన్య కానీ ఇటు శోభిత కానీ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు.
విషయం ఏమిటంటే, తన కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలో ఒక్కటి కాబోతున్నారని, ఇద్దరినీ దీవించమంటూ కొద్దిసేపటి క్రితం అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో వారిద్దరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు పోస్ట్ చేసారు. అలానే వారిద్దరి వివాహ వేడుక తేదీ త్వరలో అనౌన్స్ కానుంది. మొత్తంగా ఈ అఫీషియల్ ప్రకటన న్యూస్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.