Home సినిమా వార్తలు Mythri Producers Reacts to DSPs Words దేవిశ్రీప్రసాద్ వ్యాఖ్యల పై పుష్ప 2 నిర్మాతల...

Mythri Producers Reacts to DSPs Words దేవిశ్రీప్రసాద్ వ్యాఖ్యల పై పుష్ప 2 నిర్మాతల రెస్పాన్స్ ఇదే

devisriprasad

టాలీవుడ్ ప్రముఖు నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 పై రోజురోజుకి అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థపై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీలకపాత్రల్లో ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్ నటిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ పోస్టర్లు అన్నీ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే విషయం ఏమిటంటే మొన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో భాగంగా ఒకింత నిర్మాతలపై అసహనం వ్యక్తం చేశారు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.

ఇక ఈ ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నేడు వాటిపై నిర్మాతలు స్పందిస్తూ నిజానికి దేవిశ్రీప్రసాద్ గారి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన మా పై ఉన్నటువంటి ప్రేమని ఆ విధంగా వ్యక్తపరిచారని రాబోయే రోజుల్లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయడానికి తాము సిద్ధమని ఆయన కూడా మనతో పనిచేస్తారని, మా మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని వారు క్లారిటీ ఇచ్చారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version